Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇంకో ఐదారు రోజులు... మీ ఇష్టం, ఎంత తిడతారో తిట్టండి: మోదీ

బీహార్ లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు సుడిగాలి పర్యటన చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, మహాకూటమి నేతలను తనదైన శైలిలో విమర్శించారు. ఎన్నికల ప్రచారం మరో ఐదారు రోజుల్లో ముగుస్తుందని, లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ లు తనను ఎంతగా తిట్టాలనుకున్నా తిట్టవచ్చని అన్నారు. బక్సర్ లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, తనపై బురద చల్లడమే వారి పనని, ఓ కమలంపై ఎంత బురద పడితే, అది అంతగా వికసిస్తుందని అన్నారు. రాష్ట్రాన్ని మూడు దశాబ్దాలకు పైగా పాలించిన కాంగ్రెస్ అభివృద్ధికి సుదూరంగా నిలిపిందని దుయ్యబట్టారు. బీహారులో అన్ని రకాల వనరులు ఉన్నాయని, వాటిని సక్రమంగా వినియోగిస్తే, రైతులు బంగారం పండించవచ్చని, రెండో హరిత విప్లవానికి ఈ ప్రాంతం నాంది కావాలని మోదీ కోరారు.

More Telugu News